హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి ఆస్ట్రేలియా విభాగం ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న డిజిటల్ సభ్యత్వ నమోదు సందర్భంగా విక్టోరియా రాజధాని మెల్బోర్న్లో కీలక సన్నాహక సమావేశాన్ని అదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా వ్యాప్తం గా చేపట్టబోయే డిజిటల్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయడానికి ప్రతిఒకరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల సిడ్నీ, కాన్బెర్రాలలో నిర్వహించిన సన్నాహక సమావేశాలకు ప్రవాస తెలంగాణబిడ్డలు, కార్యకర్తల నుంచి అపూర్వ స్పందన లభించిందని, ఆ ఉత్సాహంతోనే ముందుకు సాగుతున్నామని తెలిపారు.
బీఆర్ఎస్ నాయకుడు సాయి రాం మాట్లాడుతూ.. పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్ట్రేలియా పర్యటన కోసం ఇకడి తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈ పర్యటనను చారిత్రాత్మకంగా మార్చేందుకు కార్యకర్తలందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ నాయకు డు వినయ్ సన్నీ చెలుపాటి మాట్లాడు తూ.. తెలంగాణలో బీఆర్ఎస్ని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేంత వరకు కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ఈ సన్నాహక సమావేశంలో ఉదయ్ సింహారెడ్డి, విశ్వామిత్ర మంత్రిప్రగడ, సూర్యారావు, సతీశ్ పులిపాక, రాకే శ్, నితీశ్గౌడ్, సాయిపృథ్వీ, వినోద్ కత్తు ల, సునీల్ యాదవ్, రాకేశ్ యాదవ్, భాను తేజ్, అజయ్, వివాన్, సంజురెడ్డి, సుమం త్, ఉదయ్ రెడ్డి, వెంకట్ రమణ, రామ్సాయి, సాయికృష్ణ, సాయివంశీ, సాయికిరణ్, అశ్రిత్, నరేందర్రెడ్డి, శివ, తిరుపతి పెద్ది తదితరులు పాల్గొన్నారు.