హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ గిరిజ న దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘కల్లా కపటం లేనితనం.. ఆత్మీయతల్లో అమ్మగుణం.. గి రులనే నివాసాలుగా మలుచుకొని.. ప్రకృతితో మమేకమైన జీవనం గడిపే అడవిబిడ్డలకు.. హృదయపూర్వకంగా అంతర్జాతీయ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. కొండకోనల్లోని ఆవాసాలకు.. మిషన్ భగీరథతో జలాలు అందించిన ఘన త కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. ‘పోడు భూముల గోడును మాత్రమే తీర్చలే దు.. రైతుబంధును అందించడం తో ఆగలేదు.. రాష్ట్ర రాజధానిలో ఆత్మగౌరవ భవనాలు.. గిరిబిడ్డల అస్థిత్వానికి ప్రతీకలు.. అడవి బిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే సంకల్పం.. చరిత్రలో చెరగని సంతకం’ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల ప్రస్థా నం.. వారి అభ్యున్నతిలో సువర్ణ అధ్యాయం’ అని ట్వీట్ చేశారు.