BRS Party | హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమన్వయకర్తలను నియమిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను కేటీఆర్ నియమించారు. నిన్న మెదక్, కరీంనగర్, జహీరాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, భువనగిరి, నల్లగొండ, నాగర్కర్నూల్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
1. పాలేరు – తాత మధు, ఎమ్మెల్సీ
2. ఖమ్మం – కురాకుల నాగభూషణం, మాజీ డీసీసీబీ చైర్మన్
3. వైరా – తాళ్ళూరి జీవన్, సీనియర్ నాయకులు
4. మధిర – కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే
5. కొత్తగూడెం – ఉప్పలపాటి వెంకట రమణ, సీనియర్ నాయకులు
6. సత్తుపల్లి – బీరెడ్డి నాగచంద్ర రెడ్డి, సీనియర్ నాయకులు
7. అశ్వారావుపేట – కోనేరు చిన్ని, సీనియర్ నాయకులు