భారత రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుంది : మంత్రి నిరంజన్ రెడ్డి
BRS Party | భారత రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్, కేసీఆర్ ఆలోచనలు ఈ దేశానికి అవసరమన్నారు. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో హామీలు ఇవ్వడమే తప్ప
హైదరాబాద్ : భారత రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ మోడల్, కేసీఆర్ ఆలోచనలు ఈ దేశానికి అవసరమన్నారు. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని దివాళా తీయించారు.. ప్రపంచ దేశాల ముందు దేశ ప్రతిష్ట మంటగలిపారని ధ్వజమెత్తారు.
2014, 2019 ఎన్నికల సమయంలో, బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని పేర్కొన్నారు. మద్దతు ధరల పెంపు ఒక మాయ, వ్యవసాయానికి ఉపాధిహామీ అనుసంధానం, స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు, రైతుల ఆదాయం రెట్టింపు వట్టి మోసమని మండిపడ్డారు. ఎరువుల ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి రైతుల నడ్డి విరిచారని నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు, నల్లధనం వెనక్కి తేవడం, జీఎస్టీ అమలు వంటి విఫలయత్నాలతో దేశాన్ని దివాళా తీయించారని ధ్వజమెత్తారు. గ్యాస్ ధరలు రెండింతలు పెంచి మోదీ సామాన్యుల నడ్డి విరిచాడని కోపోద్రిక్తులయ్యారు.
ఎనిమిదేళ్లలో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తూ దేశానికి రోల్ మోడల్ గా నిలిపారని మంత్రి పేర్కొన్నారు. భారతదేశానికి తెలంగాణ అభివృద్ధి ఒక నమూనాగా నిలుస్తుందన్నారు. దేశ ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ కొత్త చరిత్ర సృష్టిస్తుందని నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
Tribal Girl Education | అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

