BRS Party | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమైంది. మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలబడాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి అండగా నిలుద్దాం.. అరాచక కాంగ్రెస్ సర్కార్ కు బుద్ధి చెబుదాం! అని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపు.. రాష్టంలో కాంగ్రెస్ అరాచక పాలనకు ముగింపు పలకాలని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన పాట.. ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధితో పాటు.. అక్కడున్న ప్రముఖ, ప్రసిద్ధమైన ప్రాంతాల చారిత్రాక నేపథ్యాన్ని, స్థానికులు ప్రేమాభిమానాలను చాటుతూ పాటను రూపొందించారు. ఈ పాట వింటే.. ప్రతి ఒక్కరి రొమాలు నిక్కపొడవాల్సిందే. మరి మీరు కూడా ఓసారి ఆ పాటను వినండి..
జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి అండగా నిలుద్దాం..
అరాచక కాంగ్రెస్ సర్కార్ కు బుద్ధి చెబుదాం!జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు..
రాష్టంలో కాంగ్రెస్ అరాచక పాలనకు ముగింపు!https://t.co/pDqOxsuxFF#VoteForCar #JubileeHillsWithBRS… pic.twitter.com/phxRX8c9uA— BRS Party (@BRSparty) September 9, 2025