Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Rahul Gandhi : నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించతలపెట్టిన ర్యాలీని వాయిదా వేసుకోవాలని రాహుల్ గాంధీని ద ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) కోరింది. లేకపోతే రూ.10,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని వివరించింది.
Rahul Gandhi : నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ సహా ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే, దీపావళిని దృష్టిలో ఉంచుకుని ఈ ర్యాలీని వాయిదా వేసుకోవాలని ద ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) కోరింది. లేకపోతే రూ.10,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని వివరించింది. ఈ మేరకు సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ రాహుల్ గాంధీని కోరారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో రాంలీలా మైదానంలో ర్యాలీ జరగనుంది.
ఈ ర్యాలీ సందర్భంగా ఆ రోజు వ్యాపార సంస్థలు అన్నీ మూసేయాల్సి ఉంటుంది. అలాగే, ముందు నుంచే అక్కడ పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి. దీంతో ర్యాలీకి కొద్ది రోజుల ముందునుంచే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుంది. ఈ నేపథ్యంలో సీటీఐ తరఫున ఆ సంస్థ చైర్మన్ బ్రిజేష్ గోయల్.. రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఆయన లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. దీపావళి, ధంతేరాస్ సందర్భంగా ఈ ప్రాంతంలో రూ.25,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది.
బంగారం, వెండితోపాటు ఎలక్ట్రానిక్స్, దుస్తులు, వంట సామగ్రి, డ్రైఫ్రూట్స్, స్వీట్స్, వాహనాలు, ఆస్తుల కొనుగోలు, గిఫ్ట్ ఐటమ్స్ వంటివి భారీ స్థాయిలో అమ్ముడుపోతాయి. అయితే, ఇండియా బ్లాక్ ర్యాలీ వల్ల ఈ వ్యాపారాలకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల రూ.10,000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నవంబర్ 6న ధంతేరాస్, 8న దీపావళి, 10న భాయ్ దూజ్ వంటి పండుగులున్నాయి. అందువల్ల నవంబర్ 10 వరకు ఈ ర్యాలీని వాయిదా వేసుకోవాల్సిందిగా సూచించారు. పండుగలకు వారం రోజుల ముందు నుంచి వ్యాపారం ఉధృతంగా సాగుతుందన్నారు.
ఇప్పటికే అక్టోబర్‌లో సాగిన అనేక ర్యాలీల వల్ల తీవ్రంగా నష్టపోయామన్నారు. రోడ్లు బ్లాక్ చేయడం, రవాణా సదుపాయం లేకపోవడం, ప్రభుత్వ ఆంక్షల వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. అందువల్ల తమ విన్నపాన్ని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 10 వరకు ర్యాలీని వాయిదా వేసుకోవాలని, ఆ తర్వాతే ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

