BRS Party | ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ 25 ఏండ్ల ఆవిర్భావ పండుగ అట్టహాసంగా కొనసాగుతోంది. ఓరుగల్లు గడ్డమీద ఎల్కతుర్తి వేదికగా.. తెలంగాణ నినాదం మరోసారి మార్మోగిపోతోంది. స్వరాష్ట్రం కలను సాకారం చేసి, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా సభా వేదికపై ఆసీనులయ్యారు. ఇక తెలంగాణ పాటలతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోతోంది. కళాకారుల ఆటపాటలకు సభకు తరలివచ్చిన తెలంగాణ ప్రజానీకం డ్యాన్సులు చేస్తూ సంబురాల్లో మునిగిపోయారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని సమస్త ప్రజానీకం ఆకాంక్షిస్తోంది. మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ప్రత్యక్ష ప్రసారం వీక్షించండి..