Gattu Ramchander rao | హైదరాబాద్ : రాష్ట్రాన్ని దౌర్భాగ్యపు సీఎం పాలిస్తున్నాడు.. రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితిలోకి నెట్టేస్తున్నాడు.. రాష్ట్రానికి క్రిమినల్ సీఎంగా ఉన్నారు అని బీఆర్ఎస్ సీనియర్ నేత గట్టు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో గట్టు రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు.
దేశంలో అత్యధిక క్రిమినల్ కేసులున్న సీఎంగా రేవంత్ రెడ్డి ఘనత వహించారు. అన్ని వర్గాల పట్ల సీఎం రేవంత్ రెడ్డిది నేరపూరిత నిర్లక్ష్యం. రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేశామని ప్రజలు తమ చెప్పులతో తామే కొట్టుకుంటున్నారు. హార్టికల్చర్‌కు, అగ్రికల్చర్‌కు తేడా తెలియని సీఎం రేవంత్ రెడ్డి. సీఎంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎలా భరిస్తుందో..? సీఎంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కు ఆత్మహత్యతో సమానం. నిజంగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడు అయితే రేవంత్ రెడ్డి ఎరువుల కొరత నిజమే అని ఒప్పుకునే వాడు. ఇప్పుడు ఎరువుల కొరత లేదంటున్నాడు.. రేపు తెలంగాణలో రేవంత్ రెడ్డి అసలు రైతులే లేరని అన్నా అంటారు అని గట్టు రామచందర్ రావు విమర్శించారు.
పైన మేనేజ్మెంట్.. కింద బిజినెస్ అన్నట్టుగా ఉంది రేవంత్ తీరు. పాలన మీద కన్నా పక్కోడు కుర్చీ గుంజుకుంటారనే భయంతో రేవంత్ పాలిస్తున్నాడు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. క్రిమినల్ చేతిలో రాజ్యం ఉంటే ఏ విధంగా ఉంటుందో తెలంగాణ పరిస్థితి అలా తయారైంది. దేశంలో క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల్లో 89 కేసులతో సీఎం రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో వున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండవ స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో క్రిమినల్ చర్యలతో ప్రభుత్వం అణచివేతకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన కనపడుతుంది. చదువు గురించి తెలియదు కానీ విద్యా శాఖా మంత్రి రేవంత్ రెడ్డి. లా అండ్ ఆర్డర్ గురించి తెలియదు కానీ రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రి. అన్నింటికి మించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని గట్టు రామచందర్ రావు విమర్శించారు.