కొడకండ్ల ; జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ నూనెముంతల సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం ఆయన నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. –