ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్ పేర్కొన్నారు. సోషల్ మీడియా విశృంఖలత్వానికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర సీఈవోను కోరినట్టు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలని ఎస్ఈసీకి సూచించినట్టు తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో విషయాలపై కాకుండా వ్యక్తిత్వం దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారని, వీటిని కట్టడి చేయాలని కోరినట్టు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో సరిపడా వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు. ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని కోరామని చెప్పారు.