హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): గరళాన్ని తన కంఠంలో దాచుకొని ముల్లోకాలను కాపాడుతున్న ఆ ఉమాశంకరుడి కరుణా కటాక్షాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరుకున్నారు. సుఖశాంతులతో ఉండేలా ప్రజలందరినీ దీవించాలని ఆ మహాశివుడిని ఆయన ప్రార్థించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురసరించుకుని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా శివభక్తులు ఉపవాస దీక్షను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకున్నదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా శివాలయాలు, భక్తుల శివనామస్మరణో మారుమోగుతాయని తెలిపారు.