BRS Party | న్యూఢిల్లీ : బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎంపీలు మరోసారి రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అనుమతులేవీ లేకుండానే ఏపీ ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ తరపున సురేశ్ రెడ్డి తీర్మానం నోటీసు ఇచ్చారు. సభా కార్యకలాపాలు వాయిదా వేసి… బనకచర్లపై చర్చించాలన్న బీఆర్ఎస్ ఎంపీలు కోరారు. ఇప్పటికే ఓసారి సభలో బనకచర్లపై వాయిదా తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై అధికార పార్టీ కాంగ్రెస్ సైలెంట్ గా ఉండడంతో.. బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి ఏసీ సీఎం దగ్గర తాకట్టు పెట్టి.. ఈ ప్రాంత రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే బనకచర్ల వల్ల తెలంగాణకు జరిగే అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ పలు వేదికలపై సవివరంగా వివరించింది.
బనకచర్ల ప్రాజెక్టుపై రాజ్యసభలో చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం.
ఏపీ ప్రభుత్వం అనధికారికంగా ఉపయోగిస్తున్న గోదావరి నదీ జలాల అంశం, బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి. pic.twitter.com/5q7FQW0ZD1
— BRS Party (@BRSparty) August 11, 2025