హైదరాబాద్ జూన్ 12 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే 52 దేశాల్లో బీఆర్ఎస్ ఎన్నారై సెల్లు ఏర్పాటుచేయగా, తాజాగా ఐర్లాండ్ 53వ దేశంగా బీఆర్ఎస్ ఎన్నారై సెల్లో చేరింది. ఐర్లాండ్‌లో బీఆర్ఎస్ ఎన్నారై సెల్ పార్టీ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల సమక్షంలో గురువారం కమిటీని ఎన్నుకున్నారు.
బీఆర్ఎస్ ఐర్లాండ్ ఎన్నారై సెల్ అధ్యక్షుడిగా కిరణ్ అనుగుర్తి, ఉపాధ్యక్షులుగా విశాల్ శిరంశెట్టి, నితీశ్ చిలువేరి, ప్రధాన కార్యదర్శిగా పవన్ అనుగుర్తి, సలహా బోర్డు వైస్ చైర్మన్‌గా ఉమేశ్ చిప్ప, సలహాబోర్డు సభ్యులుగా చాను బోయిని, సూర్యచందన్, నవీన్‌కుమార్ కొండిజు, కార్యదర్శులుగా రాకేశ్ లేసాని, అన్వేశ్‌రెడ్డి, నోమాన్ సయ్యద్, ఐటీ అండ్ పీఆర్ కార్యదర్శిగా సాయి మనీశ్ తాటికొండ, ట్రెజరర్లుగా ఉమేశ్ చిప్ప, ప్రదీప్‌గౌడ్, కమ్యూనిటీ వ్యవహారాల ఉపాధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ చిర్రం, అధికార ప్రతినిధులుగా రామకృష్ణ, వేణురెడ్డి, ఉమేశ్, సోషల్ మీడియా ఇన్చార్జులుగా పవన్ అనుగుర్తి, దిలీప్‌రెడ్డి, సభ్యత్వ కోఆర్డినేటర్‌గా అభివన్
గడ్డం ఎన్నికయ్యారు.