అవ్వా.. కారు గుర్తుకే ఓటెయ్యాలి
బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నిజామాబాద్‌లో అర్బన్ మాజీ
ఎమ్మెల్యే గణేశ్‌గుప్తాతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్కు ఓటేయాలని అభ్యర్థించారు. ఓ ఇంట్లోకి వెళ్లి వృద్ధురాలిని ఆప్యాయంగా పలుకరించారు. పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరించారు. కారు గుర్తుకు ఓటేసి తనను ఆశీర్వదించాలని బాజిరెడ్డి కోరారు.
– ఖలీల్‌వాడి
కార్మికుడి బిడ్డను.. ఆశీర్వదించండి
పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని ఆర్జీ-2 ఏరియా ఓసీపీ-3 ప్రాజెక్టులో కార్మికులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ‘నేను కూడా సింగరేణి కార్మికుడి బిడ్డనే. మీ కష్టాలన్నీ నాకు తెలుసు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించండి. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా’నని హామీ ఇచ్చారు.
– యైటింక్లయిన్‌కాలనీ
మరోసారి దీవించండి..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం కల్లూరులోని ఓ బంగారు నగల దుకాణానికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు ఉన్నారు.
– పెనుబల్లి
రైతుల పక్షాన పోరాడుతా
బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి శుక్రవారం నల్లగొండ జిల్లాలోని త్రిపురారం, చింతపల్లి, దేవరకొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, నోముల భగత్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి తదితరులతో కలిసి ముమ్మర ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే పార్లమెంట్లో రైతుల పక్షాన పోరాడుతానని హామీ ఇచ్చారు.
– త్రిపురారం
కేసీఆర్ పదేండ్ల పాలన చూడండి..
శుక్రవారం రాత్రి చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. కాసాని మాట్లాడుతూ.. పదేండ్ల పాలనలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తనను గెలిపించాలని కోరారు.
– తాండూరు
50 వేల మెజారిటీతో గెలుపు తథ్యం
వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్‌కుమార్.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి శుక్రవారం రాత్రి వరంగల్ జిల్లా పర్వతగిరి రోడ్‌షోలో నిర్వహించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి 50 వేల మెజారిటీతో గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు.
– పర్వతగిరి
మోత్కూరు రోడ్‌షోలో క్యామ మల్లేశ్
భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో రోడ్‌షో నిర్వహించారు. ఇందులో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, పార్టీ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
– మోత్కూరు
ఇదీ మా మ్యానిఫెస్టో
మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి.. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం మజీద్ వద్దకు వెళ్లి ముస్లింలను కలిసి బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను అందజేశారు. కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరించాలని వారు కోరారు.
– మహబూబ్‌నగర్ అర్బన్