రాజ్యసభ సీటుకు తెలంగాణ కాంగ్రెస్‌లో అర్హులే లేరా.. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కీలుబొమ్మల్లా ఆడిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో రాజ్యసభ సీటుకు అర్హులే లేనట్లుగా దిల్లీ వారికి సీటు ఇచ్చారని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కీలుబొమ్మల్లా ఆడిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో రాజ్యసభ సీటుకు అర్హులే లేనట్లుగా దిల్లీ వారికి సీటు ఇచ్చారని విమర్శించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బీసీ, మాదిగ, మైనార్టీల్లో ఎవరికైనా ఇస్తారనుకున్నామని, వి.హనుమంతరావు లాంటి సీనియర్లు కాంగ్రెస్ అధిష్ఠానానికి కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని అభిషేక్ సింఘ్వి కనిపించారని విమర్శించారు. తెలంగాణ విషయంలో అభిషేక్ సింఘ్వీ ఏ రోజు సానుకూలంగా స్పందించలేదని, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగానే గతంలో మాట్లాడారని అన్నారు. కాంగ్రెస్‌లో ఎంతో మంది సీనియర్లు ఉన్నా రాజ్యసభ అవకాశం ఇవ్వలేదని అన్నారు. ముస్లిం, ముదిరాజ్, మున్నూరు కాపు, యాదవ కులాలకు మంత్రి వర్గంలో అవకాశం దక్కలేదని, కనీసం రాజ్యసభలోనైనా అవకాశం దక్కుతుందని చూశామని తెలిపారు.
రాష్ట్రంలో అర్హులు లేనట్లు దిల్లీ వారికి రాజ్యసభ సీటు ఇవ్వడం రాష్ట్ర ప్రజలను అవమానపరచడమే వద్దిరాజు విమర్శించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని సరైన సమయంలో సమాధానం ఇస్తారని అన్నారు. సామాజిక వర్గాల పరంగానూ కేసీఆర్ సమన్యాయం చేశారని పేర్కొన్నారు. డీఎస్, బండ ప్రకాశ్, లింగయ్య యాదవ్ లాంటి వెనకబడిన సామాజిక వర్గాలకు అవకాశం కల్పించారని గుర్తుచేశారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభం చాలా సంతోషకరమని అన్నారు. కేసీఆర్ అంటేనే నీళ్లు గుర్తుకొస్తాయన్నారు. ఏడు, ఎనిమిది నెలల్లోనే సీతారామ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని తెలిపారు. అధికారంలో ఉండి స్విచ్ అన్ చేయండి కానీ, గత పాలకులను అవమానపరచవద్దని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ ఎన్ని చేసినా రైతులు, ప్రజల గుండెల్లో నుంచి కేసీఆర్‌ను తీసివేయలేరని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

