బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
గ్యాంగ్‌స్టర్, అండర్‌వరల్డ్ నేపథ్య కథాంశాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరు పొందిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత సంజయ్ గుప్తా (57) ముంబయిలో కన్నుమూశారు.
గ్యాంగ్‌స్టర్, అండర్‌వరల్డ్ నేపథ్య కథాంశాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరు పొందిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత సంజయ్ గుప్తా (57) ముంబయిలో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తన ఇంటి బాత్రూమ్లో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆయన తలకు తీవ్రగాయమైందని సమాచారం. ఈ గాయం కారణంగానే ఆయన మరణించినట్లు తెలిసింది. 1994లో విడుదలైన ‘ఆతిష్: ఫీల్ ద ఫైర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు సంజయ్‌గుప్తా. అయితే ‘కాంటే’ (2002) చిత్రం ఆయన కెరీర్‌కు బ్రేక్‌నిచ్చింది.
సంజయ్‌దత్, అమితాబ్‌బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హీస్ట్ థ్రిల్లర్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత ‘ముసాఫిర్’ ‘జిందా’ ‘షూటౌట్ ఎట్ లోఖండ్వాలా’ ‘షూటౌట్ ఎట్ వడాలా’ ‘కాబిల్’ ‘జజ్బా’ ‘ముంబై సాగా’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ముఖ్యంగా అండర్‌వరల్డ్, గ్యాంగ్ వార్, పోలీస్ ఎన్కౌంటర్లను కథాంశాలుగా ఎంచుకొని తనదైన శైలి ైస్టెలిష్ మేకింగ్‌తో ప్రేక్షకుల్ని మెప్పించారు. స్వీయ నిర్మాణ సంస్థ వైట్ ఫెదర్ బ్యానర్‌పై పలు విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు సంజయ్‌గుప్తా. చివరగా రెండేళ్ల క్రితం ‘ది మిరిండా బ్రదర్స్’ సినిమాను రూపొందించారు. సంజయ్‌గుప్తా మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

