‘ఆర్సీ 17’లో నాయికగా?
రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘రంగస్థలం’ వంటి బ్లాస్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికై భారీ హైప్ క్రియేట్ అయింది. నేడు ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. ‘ఆర్సీ 17’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన కథానాయికగా నటించేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
గతకొంతకాలంగా బాలీవుడ్ భామలు సారా అర్జున్, అనీత్ పడ్డా పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి కథానాయికగా ఖరారైందని తెలిసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నదీ భామ. తొలి చిత్రం విడుదల కాకముందే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో ఆమెను కథానాయికగా ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంలో నిజానిజాలెంటో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

