నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్‌రెడ్డి తరఫున రూ. 20 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులను బుధవారం కోర్టుకు సమర్పించారు. అనంతరం విచారణను 15కు వాయిదా వేస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. సైఫాబాద్ పోలీసులు ఇద్దరు ఎమ్మెల్సీను అరెస్టు చేసి మంగళవారం కోర్టు ఎదుట హాజరుపర్చగా సుదీర్ఘవాదనల అనంతరం ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బెయిల్ బాండ్లను న్యాయవాది జక్కుల లక్ష్మణ్ కోర్టుకు అందించారు. జమానత్‌లను కోర్టుకు సమర్పించడంతో ఇద్దరు ఎమ్మెల్సీలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.