సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మండిపడ్డారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. ఇంట్లో దావత్ చేసుకుంటే రేవ్ పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని.. సరైన సమయంలో బుద్ధిచెబుతారని కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే.. ప్రజలు ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రిగా నిన్ను గౌరవించాలంటే.. గౌరవంగా మాట్లాడటం నేర్చుకో అని హితవు పలికారు.