హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న విచక్షణ లేని మూర్ఖుడు రేవంత్‌రెడ్డి అని.. కవుల భుజాలపై తుపాకులు పెట్టి కాల్చే నీ చేతగానితనాన్ని తెలంగాణ సమాజం క్షమించదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మహాకవి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన అందెశ్రీ స్మృతివనం ప్రారంభోత్సవ వేదికను సీఎం రేవంత్ అత్యంత జుగుప్సాకరంగా మార్చేశారని మండిపడ్డారు. ఆ వేదికపై ప్రస్తుత, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా, మానవీయ కో ణంలో దార్శనికతతో మాట్లాడాల్సిందిపోయి.. రేవంత్ తన శాడిజం, దురహంకారంతో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని దూషించడానికి వాడుకున్నారని మండిపడ్డారు.
పెండ్లికి వచ్చి సావుడప్పు కొట్టినట్టు రేవంత్ తీరు ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన మాట్లాడిన పచ్చి బూతు లు, అబద్ధాలు విని ఆ వేదికపైనే విజ్ఞుడైన అందెశ్రీ అన్న కండ్లల్లో నీళ్లు పెట్టుకొని ఉంటార ని పేర్కొన్నారు. అమరత్వంలో ఉన్న గద్దరన్న ఆత్మ కూడా ఘోషించి ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ఉపేంద్రచారి, చిరుమామిళ్ల రాకేశ్, అర్పిత ప్రకాశ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా దాసోజు మాట్లాడుతూ..‘మాయమైపోతున్నాడమ్మా మ నిషన్న వాడు’ పాట అర్ధం తెలిస్తే కన్నతండ్రి కంటే పెద్ద వయసున్న, 14 ఏండ్లు ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను పట్టుకొని గజ్వేల్‌లో సమాధి చేస్తా అనవని పేర్కొన్నారు. అందెశ్రీ, గద్దరన్న ఆత్మలు కూడా క్షమించవు అని స్పష్టంచేశారు.
రేవంత్ నువ్వు.. జైలుకు వెళ్లింది ఏమైనా స్వతంత్ర పోరాటం కోసమా?అని నిలదీశారు. ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షల సంచితో దొంగతనం చేస్తూ దొరికినందుకు జైల్లో పెట్టారని పేర్కొన్కారు. సీఎం రేవంత్‌ను చూసి క్యాబినెట్‌లోని మంత్రులంతా దోపిడీ దొంగల్లా మారిపోయారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రతిశాఖపై చార్జ్‌షీట్ వేస్తామని స్పష్టంచేశారు. రేవంత్ చెప్పే 70 వేల ఉద్యోగాల న్నీ అబద్ధమని తెలిపారు. వీటిపై అశోక్‌నగర్‌లో విద్యార్థులతో చర్చకు రా..? అని డిమాండ్ చేశా రు. కేటీఆర్ నేతృత్వంలో తెచ్చిన సింగిల్ విండో సిస్టమ్ ‘టీఎస్ ఐపాస్’ దేశంలోనే అత్యుత్తమమైనదని నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండె క్స్ రిపోర్ట్ చెప్తున్నదని గుర్తుచేశారు. అలాంటి అద్భుతమైన వ్యవస్థను రేవంత్ అవినీతితో నా శనం చేశారని మండిపడ్డారు. అప్పుల విషయం లో రేవంత్‌రెడ్డి చెప్తున్నవన్నీ దొంగ లెకలని, కాగ్ (సీఏజీ)నివేదికే రూ.3.5 లక్షల కోట్ల అప్పు అని స్పష్టంగా చెప్తున్నదని శ్రవణ్ పేర్కొన్నారు. కేసీఆర్ అప్పులతో ఆస్తులు సృష్టిస్తే.. రేవంత్‌రెడ్డి రాష్ట్రం దివాలా తీసిందని నెగెటివిటీ ప్రచారం చేస్తూ పెట్టుబడిదారులు రాకుండా ముంచేస్తున్నాడని విమర్శించారు.