హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చుతున్న ఎల్ నినో సంక్షోభాన్ని ఎదురోవడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఘో రంగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసా యం, రిజర్వాయర్లు అడుగంటిపోతున్నాయని, హైదరాబాద్‌లో సరైన పౌర ప్రభుత్వం లేక పాలనా శూన్యత ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 16 నాటికి తెలంగాణలో ఏకంగా 35% లోటు వర్షపాతం నమోదైందని, రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 27 జిల్లాలు (8 8%) కరువు బారినపడ్డాయని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీని మూడు ముకలుగా విభజించి ఎన్నికలు నిర్వహించకుండా బ్యూరోక్రాట్ల చేతుల్లో పెట్టడం వల్ల సమన్వయం కరువైందని దాసోజు శ్రవణ్ విమర్శించారు. నీటి సంక్షోభం, రోడ్ల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మిగిలిన జలాశయాల నిల్వల నుంచి తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, వాటర్ ట్యాంకర్లను సిద్ధం చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న రైతుభరోసా సాయాన్ని యుద్ధప్రాతిపదికన విడుదల చేసి, ఇన్పుట్ సబ్సిడీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వెంటనే ఎన్నికల తేదీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మూడు కార్పొరేషన్ల మధ్య ఆస్తులు, అప్పుల విభజనపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఈ విపతర పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.