MLC Kavitha | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ఎప్పటికీ గమనించలేదని విమర్శించారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ ఆమె ట్వీట్ చేశారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మోడల్ని ఏ పార్టీ కూడా విమర్శించే నైతికత లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, కల్పిస్తున్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ప్రతి పౌరుడు, టూరిస్టులు ప్రశంసించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించుకుంటే మంచిదనిహితవు పలికారు.
Not at all surprised to see that this is all the Congress Party had instead of an actual and factual rebuttal in their defence.
Truth is, no party has any counter for the proven Governance Model of CM KCR and BRS Government. Also, with a pinch of salt you’ll agree the world… https://t.co/8jSkDHAv20
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 9, 2023