హైదరాబాద్: పసుపు రైతులకు రూ.15వేల కనీస మద్దతు ధర ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత(MLC K Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనమండలి వద్ద ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. చాన్నాళ్లుగా పసుపు రైతులు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని, పసుపు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న అంశంపై కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణలోని పసుపు రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
పసుపుకు రూ. 15,000 మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శాసన మండలి ఆవరణలో నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. pic.twitter.com/i87EjWZIZl
— BRS Party (@BRSparty) March 15, 2025
పసుపు రైతులకు కనీస మద్ద ధర 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నదని, కానీ ఆ పార్టీ పసుపు రైతుల్ని మోసం చేసినట్లు కవిత ఆరోపించారు.
#WATCH | Hyderabad, Telangana: BRS MLC K Kavitha says, “Turmeric farmers have been suffering for quite some time. The minimum support price for Turmeric has not been established by the central government and the state government…Farmers across Telangana are suffering. We are… https://t.co/gTJET0eYac pic.twitter.com/mq06KkKYxL
— ANI (@ANI) March 15, 2025