హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడీ తప్ప సా మాన్యులకు ఒరిగింది ఏమీ లేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ మరోసారి పూర్తిగా విఫలమైందని పలువురు రాజకీయ నేతలు, ఆర్థిక నిపుణులు విమర్శించారు. బడ్జెట్ ప్రతిపాదనలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా ఉండాలని డి మాండ్ చేశారు. ‘తెలంగాణ బడ్జెట్ 2026-భవిష్యత్తు ఆకాంక్షలు’ అనే అంశంపై బుధవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య వి జ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను వక్తలు ఎండగట్టారు.రాష్ట్రంలోని రైతుల అభ్యున్నతికి చేయాల్సింది చాలా ఉన్నదని, ముఖ్యంగా కౌలు రైతుల సంక్షేమంపై స్పష్టత రావాల్సి ఉన్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. కీలకమైన విద్య, వైద్యరంగాలపై కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని మాజీ ఎమ్మె ల్యే, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. బడ్జెట్లో విద్యారంగానికి 18% నిధులు ఇవ్వాలని తెలంగాణ విద్యా కమిషన్ సూచిస్తే కేవలం 8 శాతంతోనే సరిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
మూసీ నదిలోకి ఎన్ని పరిశ్రమలు వ్యర్థాలను వదులుతున్నాయో తెలుసుకునేందుకు అధ్యయన కమిటీని వే యాలని హెచ్‌సీయూ ప్రొఫెసర్ చిట్టేడి కృష్ణారెడ్డి ఉద్ఘాటించారు. రూ.2 లక్షల రుణమాఫీ నేటికీ పూర్తి కాలేదని, రైతు భరోసాపై ఆంక్షలు విధించడం సరికాదని తెలిపారు. కాంగ్రెస్ ప్ర భుత్వం ప్రవేపెట్టిన 2026-27 బడ్జెట్‌ను భ్రమల బడ్జెట్‌గా ఆర్థిక విశ్లేషకుడు పాపారావు అభివర్ణించారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని, వారి కుటుంబాలకు రైతు బీమా అందడం లేదని సామాజిక వేత్త పులి రాజు ఆవేదన వ్యక్తం చే శారు. రైతులతోపాటు కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కా ర్.. రాష్ట్రంలోని 26 లక్షల మంది కౌలు రైతులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పెరిగిన నిర్మాణ వ్యయా ల దృష్ట్యా ఇందిరమ్మ ఇండ్ల సాయాన్ని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం లేదని ఐఆర్ఎస్ అధికారి సాయిప్రసాద్ గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించాలని ‘టాస్క్’ కన్వీనర్ ఎర్రో జు శ్రీనివాస్ కోరారు. సమావేశంలో ‘టాస్’ కో-కన్వీనర్ రవీందర్, నగర కన్వీనర్ జీ రూబీ స్టీవెన్సన్, రాజు, సాజిదాఖాన్ తదితరులు పాల్గొన్నారు.
అప్పులతో రాష్ర్టాన్ని నడుతుపున్నారు: దాసోజు
బడ్జెట్ అంటే సామాన్యుడి జీవితాల్లో వెలుగు నింపేదిగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.770 అంచనాతో మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెడితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ రూ.940 కోట్ల లోటు బడ్జెట్‌ను ప్రతిపాదించిందని ధ్వజమెత్తా రు. రేవంత్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితులు దాటి అప్పులు చేస్తున్నదని, సంవత్సరంలో 363 రోజులపాటు ఆర్బీఐ నుంచి అప్పులు తెచ్చి రాష్ర్టాన్ని నడుపుతున్నదని దుయ్యబట్టారు.