Palamuru Lift | హైదరాబాద్ : ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు నీరందించే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎత్తిపోతలను పూర్తిగా విస్మరించిన రేవంత్ రెడ్డి.. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల మీద దృష్టి సారించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాముఖ్యతను వివరిస్తూ గతంలో ఓ జాతీయ ఛానెల్ టెలికాస్ట్ చేసిన వీడియోను దాసోజు శ్రవణ్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ ఈ విధంగా స్పందించారు.
ఇంత మంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఎందుకు నారాయణపేట కొండంగల్ ప్రాజెక్ట్ మీద పడ్డాడు..? అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. కొండంగల్ ప్రాజెక్టు కంటే ఎక్కువ భూమిని సాగుకు తీసుకొస్తది, 95 శాతం పూర్తయింది. ఓపక్క పైసలు మరో పక్క సమయాన్ని రెండు కూడా సేవ్ చెయ్యచ్చు, కానీ పాలమూరు ఎత్తిపోతలను పక్కన పెట్టిండు అని ఎమ్మెల్సీ దాసోజు మండిపడ్డారు.
దాదాపు రూ. 600 కోట్లు ఇచ్చి సంవత్సరం అవుతుంది, తట్టెడు మట్టి ఎత్తలేదు.. కొడంగల్ ప్రాజెక్ట్‌లో, అప్పు పుడుతలే అని చెప్పి ఇన్ని వృధా పనులు ఎందుకు చేస్తున్నారు? కేవలం కమీషన్ల కక్కుర్తితో కాంట్రాక్టుల కోసమే ఇవన్నీ చేస్తున్నారా..? సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిలదీశారు.
ఇంత మంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఎందుకు నారాయణపేట కొండంగల్ ప్రాజెక్ట్ మీద పడ్డాడు ? @TelanganaCMO @revanth_anumula @UttamINC
PRLP ప్రాజెక్ట్, కొండంగల్ ప్రాజెక్టు కంటే ఎక్కువ భూమిని సాగుకు తీసుకొస్తది, 95% పూర్తయింది. ఓపక్క పైసలు మరో పక్క… pic.twitter.com/qusGZGrEWd
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) August 2, 2025