హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోల్లో శాసనసభా ప్రాంగణానికి చేరుకున్నారు.
ఆటోడ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌చేశారు. ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖాకీ అంగీలు ధరించి ఆటోల్లో అసెంబ్లీకి బయలుదేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు, మాజీ మంత్రి గంగుల కమలాకర్,ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు ఆటో నడిపారు. ఉదయం నుంచి సభలు వాయిదాపడే దాకా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఖాకీ అంగీ ధరించే ఉన్నారు.