BRS MLAs: రేపటి (డిసెంబర్ 28) నుంచి జనవరి 8వ తేదీ వరకు తెలంగాణ ప్రభత్వం నిర్వహించతలపెట్టిన ప్రజా పాలన సన్నాహాక సమావేశాల గురించి అధికారులు తమక సమాచారం ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు ప్రొటోకాల్ పాటించాలని, రాజకీయ కక్షలు చూపించవద్దని విమర్శించారు.
ప్రజా పాలన సన్నాహక సమావేశాల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తమ ఫొటోలు కూడా లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాపోయారు. మంత్రి కొండా సురేఖ ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తమ నియోజకవర్గంలో జరిగిన ప్రజాపాలన సన్నాహక సమావేశానికి తమను ఆహ్వానించలేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.