హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : రెండు లక్షల రుణమాఫీ చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని, ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గన్‌పార్క్ వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, 13 హామీలు, రెండు లక్షల రుణ మాఫీ చేస్తేనే తన పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు ప్రకటించారని, ఆరు గ్యారెంటీలు ఉసేలేదని, ఇంకా 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరానని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవి, అంజనేయగౌడ్, వాసుదేవరెడ్డి, భిక్షపతి, మన్నె గోవర్ధన్‌రెడ్డి, గోసుల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు, చటారి దశరథ్ పాల్గొన్నారు.