హైదరాబాద్: గాంధీ దవాఖాన (Gandhi Hospital) వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దవాఖానలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య స్వల్వ తోపులాట చోటుచేసుకున్నది. మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యతోపాటు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, మాగంటి గోపీనాథ్‌ను అదుపులోకి తీసుకుని అక్కడినుంచి తరలించారు. పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్ప్రయత్నించారు.
గాంధీ సహా రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల అధ్వాన పరిస్థితిని అధ్యయనం చేసేందుకు రాజయ్య నేతృత్వంలో బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. నేటి నుంచి నిపుణులైన డాక్టర్లతో కూడిన త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించింది. ఇందులో భాగంగా గాంధీ దవాఖానను పరిశీలించాల్సి ఉన్నది. అయితే కమిటీ పర్యటనను కాంగ్రెస్ సర్కార్ అడ్డుకున్నది. రాజయ్య సహా కమిటీ సభ్యులైన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే సంజయ్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అనేక నిర్బంధాల నడుమ గాంధీ దవాఖానకు చేరుకున్న కమిటీ సభ్యులతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు.
ఆసుపత్రులను పరిశీలించేందుకు వెళ్తే అరెస్టులా❓
ఎందుకింత భయం నీకు రేవంత్❓రాష్ట్రంలో దిగజారిన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులను పరిశీలించేందుకు భారత రాష్ట్ర సమితి నియమించిన అధ్యయన కమిటీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం డా. తాటికొండ రాజయ్యను, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే… pic.twitter.com/24V96uqRPT
— BRS Party (@BRSparty) September 23, 2024