MLA Sunitha | నర్సాపూర్, ఫిబ్రవరి15 : సంత్ సేవాలాల్ గిరిజనుల అభివృద్దికి, వారి చైతన్యానికి ఎనలేని కృషి చేశారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. శనివారం నర్సాపూర్ – హైదరాబాద్ ప్రధాన రోడ్డులోని సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ఆయన 286వ జయంతిని గిరిజనులు ఘనంగా నిర్వహించారు. వాహనంపై సేవాలాల్ చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించి బారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గిరిజనులందరు సంత్ సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలని సూచించారు. సమాజ హితం కోసం సేవాలాల్ అహింసా మార్గంలో నడిచాడని గుర్తుచేశారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మదినం సందర్బంగా ఆలయ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు సేవాలాల్ మహారాజ్‌కు ప్రత్యేక పూజలు జరిపించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, కాంగ్రెస్ నాయకులు గాలి అనిల్‌కుమార్, జడ్పీ కో-ఆప్షన్ మాజీ మెంబర్ మన్సూర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు జీవన్‌రెడ్డి, సేనాధిపతి, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.