MLA Palla Rajeshwar Reddy | హైదరాబాద్ : జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన అంబులెన్స్‌లో సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో.. ఈ ఉదయం పల్లా రాజేశ్వర్ రెడ్డి అస్వస్థతకు గురికాగా, వెంటనే అంబులెన్స్ పిలిపించి ఆస్పత్రికి తరలించారు.