Padi Kaushik Reddy | మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి అడ్డు వస్తున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ లేకుండా చేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం నారాయణ రెడ్డి పేరును ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రపోజ్ చేశాడని.. జీవన్ రెడ్డి ఏమో గంగారెడ్డి పేరును పంపించారని తెలిపారు. దీంతో గంగారెడ్డిని లేకుండా చేస్తే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎవరూ అడ్డు ఉండరని భావించి అతన్ని జగిత్యాల ఎమ్మెల్యే లేకుండా చేశారని అన్నారు.
గంగారెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హత్య చేయించాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెబుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్వయంగా ఎమ్మెల్సీ చెబుతున్నప్పటికీ పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై హత్యకేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ పేరుతో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికి సిగ్గు అనిపించడం లేదా అని మండిపడ్డారు.
మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవికి అడ్డు వస్తున్నాడని జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. గంగారెడ్డిని లేకుండా చేశాడు
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మెన్ కోసం నారాయణ రెడ్డి పేరు ప్రొపోజ్ చేశారు.. జీవన్ రెడ్డి ఏమో గంగారెడ్డి పేరు పంపాడు
దీంతో గంగారెడ్డిని… https://t.co/Uo8ASiR9G8 pic.twitter.com/zQ5wyEptRr
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2024
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు. పార్టీ మారిన నియోజకవర్గాల్లోఉప ఎన్నిక రావడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అరాచకాలపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు.
తెలంగాణలో ప్రజలు కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ పెద్ద మనుషులు టూర్లు వేస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ, కేరళ టూర్లో బిజీగా ఉంటే.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సౌత్ కొరియా టూర్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేసియా టూర్.. మంత్రి కొండా సురేఖ కోర్టుల టూర్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను వదిలేసి హెలికాప్టర్ల కోసం కోమటిరెడ్డి వెంటకరెడ్డి గొడవలు పడుతున్నారని తెలిపారు.