హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి మల్లారెడ్డి తనదైన మార్క్ ప్రసంగంతో సభలో నవ్వులు పూయించారు. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం, కాళేశ్వరం వంటి అంశాలపై సీరియస్‌గా చర్చ జరుగుతున్న సమయంలో మల్లారెడ్డిని మాట్లాడాలంటూ స్పీకర్ అవకాశం ఇచ్చారు. అప్పటికే భట్టి విక్రమార్క మాజీ సీఎం కేసీఆర్‌పై, గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో వివరణ ఇచ్చేందుకు తమకు మైక్ కావాలని హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితర నేతలు స్పీకర్‌ను కోరగా.. ఆయన వారందరినీ కాదని మల్లారెడ్డికి అవకాశం ఇచ్చారు. మల్లారెడ్డి లేచి.. ‘అధ్యక్షా వసంత పంచమి వచ్చింది. ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రం మొత్తం 26 వేల పెండ్లిళ్లు ఉన్నాయి. కాబట్టి ఆ రెండు రోజులు సభ నడుపొద్దని కోరుకుంటున్నా’ అని కోరారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరబూశాయి.