KTR | హైదరాబాద్ : శాసనసభలో ఇవాళ బీసీ బిల్లుపై చర్చ సందర్భంగా వాడివేడీ చర్చ జరిగింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన అనంతరం.. ప్రతిపక్ష పార్టీ తరపున బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను కేటీఆర్ లేవనెత్తారు. దీంతో మంత్రులు జోక్యం చేసుకుని కేటీఆర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. మంత్రులే కాకుండా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా కల్పించుకుని మాట్లాడారు.
ఆది శ్రీనివాస్ మాట్లాడిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ సంప్రదాయాన్ని ఎక్కడా చూడలేదు. మంత్రులు ఇంటర్విన్ అవుతారు. మరి గవర్నమెంట్ విప్లు కూడా ఇంటర్విన్ అవుతున్నారు. మా శీనన్న(వేములవాడ ఎమ్మెల్యే) కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నా. మా రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డ. మా లక్ష్మన్న(ధర్మపురి ఎమ్మెల్యే) మొన్ననే మంత్రి అయిండు. వారికి శుభాకాంక్షలు. మా శీనన్న కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నా. భవిష్యత్లో వారు ముఖ్యమంత్రి కూడా కావాలని కోరుకుంటున్నా అని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.