MLA KP Vivekanand | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ పరిధిలోని అన్నానగర్‌లో బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపీ వివేకానంద్, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధికి గోపీనాథ్ చేసిన సేవలను ప్రజలు స్మరించుకున్నారు. అదేవిధంగా మరోమారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలను నయవంచన చేసేందుకు ప్రచారం పేరుతో తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులకు “బాకీ కార్డు” చూపించి ఆరు గ్యారంటీల అమలుపై నిలదీయాలన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ… అన్నా నగర్ బస్తీని నిలబెట్టింది గోపన్ననే.. సునితమ్మ గెలుపుతో జూబ్లీహిల్స్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగురాలన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, మరోమారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో అభివృద్ధి జపం పటిస్తూ మరోమారు ప్రజలను నయవంచనకు గురి చేస్తుందని, కాంగ్రెస్ నాయకుల దొంగ మాటలను ప్రజలు నమ్మవద్దని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండి సునితమ్మ గెలిపించుకున్నప్పుడే నియోజకవర్గం లోని ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్ కుమారుడు మాగంటి వాత్సల్యనాథ్, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు క్రిష్ణ మోహన్, స్థానిక బిఆర్ఎస్ నాయకులు విజయ్ కుమార్, వసంత రావు, మహిళా నాయకురాల్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.