హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోమవారం కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్, కార్పొరేటర్లు చేరారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, దామోదర, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు పాల్గొన్నారు.