హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో మైనారిటీ ముస్లింల పరిస్థితి దారుణంగా మారిందని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ మైనారిటీ నేతలు విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం మైనారిటీ సెల్ నేతలు వాసీం, నహీం,
ఇక్బాల్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమంలో భాగంగా వరంగల్, హనుమకొండలో షాదీఖానా, హజ్హౌజ్ల నిర్మాణాలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 25 కుంటలు, 18 కుంటల స్థలాలతోపాటు రూ. 5 కోట్లు కేటాయించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలాల్లో స్టార్హోటల్స్ కట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.