సర్‌పై అవగాహన కలిగి ఉండాలి
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలని, బీఆర్ఎస్ సభ్వత్వాన్ని వెంటనే పూర్తి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
- బీఆర్ఎస్ సభ్యత్వాన్ని పూర్తి చేయాలి: ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
భూత్పూర్, జూన్ 19 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలని, బీఆర్ఎస్ సభ్వత్వాన్ని వెంటనే పూర్తి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లోని మాజీ ఎమ్మెల్యే ఆల నివాసంలో పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ గ్రామాలు, వార్డులు, పట్టణాల్లో 30 శాతానికి పైగా బీఆర్ఎస్ సభ్యత్వ సమోదు చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తు ంగలో తొక్కిన విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలన్నారు. సర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓట్లను తొ లగించేందుకు కుట్ర చేస్తున్నట్టు ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ ఆల శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
అత్యంత పారదర్శకంగా ‘సర్’ ప్రక్రియ ; అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 25 నుంచి చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బీ సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘సర్’ సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు ప్రధానాధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ‘సర్’ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన మార్గదర్శకాలను అధికారులు కచ్చితంగా పాటించాలని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

