(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో బుధవారం జరిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)సభపై జాతీయ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే వేదిక అంటూ పలు ప్రధాన మీడియా సంస్థలు ఈ సభను అభివర్ణించాయి. ఇంగ్లిష్, హిందీ న్యూస్ వెబ్సైట్లు, న్యూస్ చానల్స్‌తో పాటు కన్నడ తదితర ప్రాంతీయ భాషలకు చెందిన ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలోనూ రోజంతా విస్తృతస్థాయిలో కథనాలు వెలువడ్డాయి.
సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరాయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజాతో పాటు పలువురు జాతీయ నాయకులు.. కేసీఆర్ పాలనను, నాయకత్వాన్ని ప్రశంసించిన విధానాన్ని పలు పోర్టల్స్, న్యూస్ చానల్స్ డిబేట్ల రూపంలో ప్రసారం చేశాయి. సోషల్‌మీడియా వేదికలైన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బీఆర్ఎస్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో కొనసాగింది.
ప్రధాన వెబ్సైట్లు, టీవీ చానల్స్‌లో కథనాలు ఇలా..