హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభంజనం సృష్టించాలని కోరుతూ టీటీడీ మాజీ అనుసంధానకర్త దొంతు రమేశ్, జమ్మికుంట మున్సిపల్ వైస్‌చైర్మన్ దేశిని స్వప్నకోటి గురువారం కోల్‌కతాలో కాళీమాతకు పూజలు నిర్వహించారు.
జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ రాణించి, దేశప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని అమ్మవారిని కోరుకొన్నట్టు వారు తెలిపారు.