420 హామీలిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 420 రోజులు గడిచినా వాటిని నెరవేర్చలేదని బీఆర్ఎస్ విమర్శించింది. కోతల, ఎగవేతల కాంగ్రెస్‌కు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. ఇప్పటికైనా ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ ఆపాలని, తానిచ్చిన హామీలు, గ్యారెంటీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నాయకులు హితవు పలికారు.
గాంధీ మహాత్ముడి వర్ధంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్యకర్తలు, విద్యార్థి విభాగం నేతలు నివాళులర్పించారు. మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందంటూ బాపూజీ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించి వినూత్న నిరసన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా కాంగ్రెస్‌కు సద్బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు. విద్యార్థులు, యువత, మహిళలు, వివిధ పర్గాల ప్రజలు తమతమ సమస్యలను వినతిపత్రాల రూపంలో గాంధీకి సమర్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 రోజులు గడిచినా 420 హామీలపై కాలయాపన చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శలు గుప్పించారు.
నల్లగొండ జిల్లా దేవరకొండలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తదితరులు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చిత్రంలో బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తున్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడి, చిత్రంలో బీఆర్ఎస్ నేతలు
సంగారెడ్డిలో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ నేతలు
హనుమకొండలో మహాత్మాగాంధీకి వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, పార్టీ నాయకులు
మెదక్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆసిఫాబాద్ టౌన్లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ప్రభుత్వం హామీలు అమలు చేయాలనే డిమాండ్‌తో హైదరాబాద్ గాంధీ దవాఖానలోని గాంధీ విగ్రహం ఎదుట బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, కార్యకర్తల నిరసన
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్