మణుగూరు టౌన్, మార్చి 22 : గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి లారీలు, ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అక్రమార్జనే ధ్యేయంగా ఇసుక రవాణా సాగిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అక్రమ రవాణాను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.