పొంగులేటీ.. మంత్రి పదవి నుంచి దిగిపో
అక్రమ మైనింగ్‌కు పాల్పడిన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ మాజీ విప్ కేపీ వివేకానంద డిమాండ్ చేశారు.
- అక్రమ మైనింగ్‌కు బాధ్యత వహించాలి
- నాడు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నది మర్చిపోయావా?
- మంత్రి పదవి రాగానే అహంకారం పెరిగిందా?
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): అక్రమ మైనింగ్‌కు పాల్పడిన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ మాజీ విప్ కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రెవెన్యూశాఖ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. గత బడ్జెట్ సమావేశాల్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ మైనింగ్‌పై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ నేత హరీశ్‌రావు మాట్లాడగానే రాత్రికి రాత్రే కేరళకు పారిపోయిన వ్యక్తి పొంగులేటి అని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయిందని, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏదో ఏం ఉద్ధరించడానికి కేరళ వెళ్లారని ఎద్దేవా చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ గురించి హరీశ్‌రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెట్టారని, తమది తప్పయితే ఉరి తీయాలని కూడా సవాల్ చేశారని గుర్తుచేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలను బీఆర్ఎస్ బయటపెట్టగానే.. అలుగులో పొగపెడితే.. ఎలుక బయటకు వచ్చిన చందంగా పొంగులేటి బయటకు వచ్చాడని దుయ్యబట్టారు. పొంగులేటి మీడియాతో మాట్లాడిన తీరు చూస్తే.. మంత్రివర్గమంతా అవినీతిలో కూరుకుపోయిందన్న సంగతిని ఆయనే అంగీకరించారని పేర్కొన్నారు.
పొంగులేటి అక్రమాలను కాపాడుతున్న రేవంత్
ఓ వైపు రాఘవ కన్స్ట్రక్షన్స్ తన కుమారుడిదేనని పొంగులేటి అంగీకరిస్తుండగా.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అది మంత్రి పొంగులేటిది కాదని అంటున్నాడని వివేకానంద విమర్శించారు. ఈ విధంగా పొంగులేటి అక్రమాలను రేవంత్‌రెడ్డి కాపాడుతున్నాడని ఆరోపించారు. చేసిన అక్రమాలు, తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసమే పొంగులేటి మీడియాతో మాట్లాడారని విమర్శించారు. బోడిగుండుకు మోకాలుకు ఏం సంబంధం అని మాట్లాడిన వ్యక్తి చివరకు అన్నింటిలో తనకు సంబంధం ఉన్నట్టు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఈ విధంగా కుడితిలో పడిన ఎలుకలా పొంగులేటి పరిస్థితి తయారైందని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కాళ్లు పట్టుకున్నావు కదా..

కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం పొంగులేటి ఉదయం నుంచి గంటలకొద్దీ పడిగాపులు పడి, ఆయన కాళ్లు పట్టుకున్న సంగతి మర్చిపోయవా అని వివేకానంద గుర్తుచేశారు. ఆ సమయంలో కేసీఆర్‌ను దేవుడుగా భావించిన పొంగులేటి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌లో మంత్రి పదవి రాగానే అహంకారంతో చెలరేగిపోతున్నాడని మండిపడ్డారు. మైనింగ్ అక్రమాల గురించి మాట్లాడితే పారిపోయిన పొంగులేటి, దాదాపు 12 రోజుల తర్వాత ఇప్పుడెందుకు మీడియాతో మాట్లాడాడు అని అనుమానం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

