‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
నక్కగూడెం గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక మల్లేశ్వరి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పిల్లుట్ల రఘు డిమాండ్ చేశారు. సోమవారం గ్రామానికి చెందిన మాలోత్ సైదా కుటుంబాన్ని ఆయన పరామర్శించి, బాలిక మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
– బాలిక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి
– నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలి
– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పిల్లుట్ల రఘు
– బాధిత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం ప్రకటన
చింతలపాలెం, అక్టోబర్ 12 : నక్కగూడెం గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక మల్లేశ్వరి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పిల్లుట్ల రఘు డిమాండ్ చేశారు. సోమవారం గ్రామానికి చెందిన మాలోత్ సైదా కుటుంబాన్ని ఆయన పరామర్శించి, బాలిక మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ జ్వరంతో బాధపడుతున్న మల్లేశ్వరిని ఈ నెల 6న హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా 10వ తేదీ వరకు ఆరోగ్యంగా ఉన్న బాలిక అదే రోజు మధ్యాహ్నం వైద్యులు అందించిన చికిత్స అనంతరం అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకుందని ఆరోపించారు. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే బాలిక మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు.
వైద్యుల చికిత్సలో జరిగిన వైఫల్యమే బాలిక మృతికి కారణమని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతిచెందిన బాలిక ఉన్న అంబులెన్స్‌ను సుమారు మూడు గంటలకు పైగా కనిపించకుండా చేశారని, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. అలాగే జిల్లా వైద్యాధికారులు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చిన పరిహారం, ప్రభుత్వ ఉద్యోగాన్ని తక్షణమే అందించాలని కోరారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు.
బాధిత కుటుంబానికి తనవంతుగా రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేస్తానని రఘు ప్రకటించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అప్పుడు బాధిత కుటుంబానికి శాశ్వత నివాస గృహాన్ని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అధైర్యపడవద్దని, కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ ఉద్యమ నాయకుడు, అడ్వకేట్ నగేష్ రాథోడ్, మాజీ సర్పంచ్ జీవల రవీందర్, మాజీ ఉప సర్పంచ్ దొంగరి నరేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు దొంగరి సైదయ్య, పాండు జీవల, మాలోత్ చందర్రావు, గుగులోత్ వెంకటేశ్వర్లు, జగన వెంకటేశ్వర్లు, గుగులోత్ భాస్కర్, బధ్య, నాగు, భూపాల్, ఉంగరాల సైదా, బాలు, ధర్మతో పాటు బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

