‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రావులపల్లి గ్రామానికి మంజూరైన 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని గొట్టిపర్తి గ్రామానికి మార్చొద్దని రావులపల్లి గ్రామ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ కుమార్ అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో ఆయన...
– రావులపల్లి గ్రామ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ కుమార్
తుంగతుర్తి, అక్టోబర్ 12 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రావులపల్లి గ్రామానికి మంజూరైన 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని గొట్టిపర్తి గ్రామానికి మార్చొద్దని రావులపల్లి గ్రామ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ కుమార్ అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రావులపెళ్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిచిండని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తు కక్ష సాధింపు చర్యలో భాగంగానే రావులపళ్లి గ్రామానికి మంజూరైన 30 పడకల ప్రభుత్వాసుపత్రిని గొట్టిపర్తి గ్రామంలో నిర్మించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఈ అంశంపై ఇటీవల సూర్యాపేట జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కూడా కలెక్టర్ కు వినతి పత్రం అందించామని తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మందుల సామేల్, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆస్పత్రిని వేరే ప్రాంతానికి తరలించాలనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. రావులపల్లిలోనే పక్కా ప్రభుత్వ భవనం నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల వీరన్న, చింతకుంట్ల మునేష్, కొమ్ము బాబు, పల్లెర్ల విష్ణు, మల్లేపాక వినయ్, చింతకుంట్ల యాకన్నా పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

