రేవంత్ అనుచిత వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై ఇటీవల సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు.
- సీఎంపై చర్యలు తీసుకోవాలని పోలీస్స్టేషన్లలో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
కరీంనగర్ కార్పొరేషన్/నర్సంపేట/మారేడ్‌పల్లి/జగిత్యాల కలెక్టరేట్, జూలై 13 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై ఇటీవల సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవా రం రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యా దు చేశారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నాయకులు కరీంనగర్‌లోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర పోలీ స్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ మహేశ్ బీ గితేకు జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరు ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పీఎస్‌లో సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ పట్టణ నాయకులు, కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లి పోలీసు స్టేషన్లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.
రోడ్డుపై జీవన్‌రెడ్డి బైఠాయింపు
రేవంత్‌పై ఫిర్యాదు చేయడానికి వస్తున్న ట్టు ముందస్తు సమాచారమిస్తే పోలీసులు అందుబాటులో లేకపోవడంతో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి మం డిపడ్డారు. సోమవారం జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. ఆయన వెంట జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, సర్పంచులు, కౌన్సిలర్లు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

