మంచిర్యాల, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ నేతలపై నజర్ పెట్టారు. సోమవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు పొన్నం మల్లేశంగౌడ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో బాల్క సుమన్ టీ తాగడానికి మల్లేశంగౌడ్ ఇంటికి వచ్చా రు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో వచ్చి హడావిడి చేయడాన్ని సుమన్ తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతోనే సోదాల పేరిట పోలీసు, రెవెన్యూ అధికారులను తమ ఇంటి మీదకు సర్కార్ ఉసిగొల్పుతున్నదని మండిపడ్డారు. మంత్రి వివేక్ ఆదేశాలతోనే ఈ త తంగమంతా నడిపించారని ఆరోపించారు. చెన్నూర్, క్యాతన్‌పల్లిలో వందలాది మంది పోలీసులను దింపి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు.