MLA Palla Rajeshwar Reddy | బచ్చన్నపేట, జూన్ 14 : ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో గాయపడి సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కట్కూరు రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో వీఎస్ఆర్ నగర్ మాజీ సర్పంచ్ కోనేటి స్వామి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కోనేటి స్వామి మాట్లాడుతూ.. శ్రీ రాజరాజేశ్వర స్వామి కృపతో పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. జనగామ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నిత్యం పరితపించే నాయకుడు విద్యా ప్రదాత, ఆరోగ్య ప్రదాత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. త్వరగా కోలుకొని ప్రజల ముందుకు రావాలని భగవంతుని వేడుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు కళ్యాణం ధనంజయ్, కోనేటి నరేష్, శ్రీరాముల హరి, యోగిరాం జిట్ట శ్రీకాంత్, రజినీకాంత్, నరసింహులు, భాను తదితరులు పాల్గొన్నారు.