చిగురుమామిడి/మాగనూరు, అక్టోబర్ 30: వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్, నారాయణపేట జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. కోతలు ప్రారంభమై దాదాపు 20 రోజులు కావస్తున్నా.. వడ్లు ఇంకెప్పుడు కొంటారంటూ బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్ కార్యాలయం ఎదు ట వరి ధాన్యం కుప్ప పోసి రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఆటంకం లేకుం డా వడ్లు కొనుగోలు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్ ముద్దసాని రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కోల్పూరులో బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. 30 రోజుల కిందట కోతలు కోసి విక్రయించేందుకు 500 బస్తాలకుపైగా వడ్లు సిద్ధంగా ఉన్నా అధికారు లు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. ఈ విషయమై ఐకేపీ ఏపీఎం వనిత కుమారిని వివరణ కోరగా.. గన్నీ బ్యాగులు వచ్చాక వడ్లు కొనుగోలు చేస్తామని తెలిపారు.