చెన్నూర్, మే 31: బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్, కోటపల్లి మండలం పారుపల్లిలో జాతీయ రహదారిపై ఆదివారం రాస్తారోకో చేసి, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.
దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణిలో అక్రమాలపై ప్రశ్నించినందుకు బాల్క సుమన్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం బాల్క సుమన్‌పై పెట్టిన కేసులను ఎత్తివేసి, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.